ధన్వంతరి కేసులో బాధితులదే విజయం
23-06-2026 12:00 AM
విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అధినేత గిరిప్రసాద్ శర్మ
ముషీరాబాద్, జూన్ 22(విజయక్రాంతి): ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్(డీఎఫ్‌ఐ) కేసులో బాధితులకు పూర్తి న్యాయం జరిగిందని విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అధినేత గిరిప్రసాద్‌శర్మ తెలిపారు. సోమవారం విజయ్‌కుమార్, వేదాంతి పాండేతో కలసి ఆయన మాట్లాడారు. డీఎఫ్‌ఐ ఆస్తుల జప్తుపై ప్రభుత్వనిర్ణయాన్ని నాంపల్లి ఎంఎస్జే కోర్టు సమర్థించగా, స్టే కోరుతూ నిందితుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందన్నారు.






