23 June, 2026 | 1:37 AM

కుక్కలు, కోతులు, దోమల బెడద నివారించాలి

23-06-2026 12:00 AM

వరంగల్, జూన్ 22 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో ప్రతి వీధిలో కుక్కలు, కోతులతో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని ప్రతి ఇంటిపైన కోతుల దాడులు చేస్తుంటే ప్రతి వీధిలో కుక్కలు స్త్వ్రర్యి విహారం చేయటం వలన ప్రజలు తీవ్ర సౌకర్యానికి గురవుతున్నారు.

కుక్కల దాడిలో చిన్న పిల్లలు మరణించిన విషయాన్ని  ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రజా సంఘాల నాయకులు ధారబోయిన సతీష్ ప్రజావాణిలో హనుమకొండ జిల్లా కలెక్టర్  దృష్టికి తీసుకువెళ్లినారు. నగరంలో దరిదాపు 65వేల కుక్కలు సంచరిస్తున్న నేపథ్యంలో నగర ప్రజలను రక్షించడానికి కార్పొరేషన్ తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగరంలో కుక్కలను కోతులను పట్టుకోవడానికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ కి కార్పొరేషన్ బడ్జెట్ నుండి లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చూపెడుతున్నారు కానీ, క్షేత్రస్థాయిలో సమస్యకు పరిష్కారం మాత్రం దొరకటం లేదని అభిప్రాయపడినారు.

రాబోయే వర్షాకాలంలో దోమల బెడద కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఫాగింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని  కలెక్టర్ కి విజ్ఞప్తి చేసినారు. నగర ప్రజల నుండి  పన్నులు వసూలు చేయటానికి చూపిస్తున్న శ్రద్ధ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా కుక్కలు, కోతులు, దోమల బెడదను పరిష్కరించటంలో నగరపాలక సంస్థ వైఫల్యం స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ తన బాధ్యతగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని అభిప్రాయబడినారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు,