16 August, 2026 | 8:32 PM

ఘనంగా గ్రామ దేవతల ఉత్సవాలు

17-06-2024 12:54 AM
  • హాజరైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

రోడ్ల అభివృద్ధి సంస్థల చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 16: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్‌లో మల్లన్న, ఎల్లమ్మ గ్రామదేవతల కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, భువనగిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ క్యామ మల్లేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ పిగ్లీపూర్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతం సుభీక్షంగా ఉండాలని దేవతలను వేడుకున్నట్లు చెప్పారు.

ఈ కల్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున్న నిర్వహించిన యాదవులందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్దగోని రామ్మోహ న్‌గౌడ్, జడ్పీటీసీ బింగి దాసుగౌడ్, జాఫర్‌గూడెం సర్పంచ్ రాధాకృష్ణ యాదవ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మంగ వెంకటేష్, యాదవ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.