16 August, 2026 | 1:46 AM

హోరాహోరీగా ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్

16-08-2026 12:42 AM

హైదరాబాద్, ఆగస్టు 15 : హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈక్వెస్ట్రియ న్ ఛాలెంజ్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. జూనియర్ స్థాయిలో పలువురు యువ రైడర్లు ఈ పోటీలలో సత్తా చాటుతున్నారు. హ్యాక్స్, డ్రెస్సేజ్ విభాగాల్లో రైడర్స్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. డ్రెస్సేజ్ జూనియర్ విభాగంలో  అద్భుత ప్రదర్శన కనబరిచిన గౌతమ్ సంజయ్ సుజనేని అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో సాయి తన్వి రెడ్డి రెండో స్థానంలో నిలిచింది.డ్రెస్సేజ్ చిల్డ్రన్ విభాగంలో జనంపల్లి హితేష్ రెడ్డి అగ్ర స్థానంలో నిలిస్తే, అనేట్ కేసలీనా రెండో స్థానంలో నిలిచారు.

డ్రెస్సేజ్ జూనియర్ విజేతలు :

1. గౌతమ్ సంజయ్ సుజనేని ( హెచ్ పీఆర్ సీ)

2. కుంభం సాయి తన్వి రెడ్డి ( హెచ్ పీఆర్ సీ)

డ్రెస్సేజ్ చిల్డ్రన్ 1 విజేతలు :

1. జనంపల్లి హితేష్ రెడ్డి ( హెచ్ పీఆర్ సీ)

2. అనేట్ కేసలీనా ( హెచ్ పీఆర్ సీ)

3. మెరెడ్డి అక్షజ్ రెడ్డి ( హెచ్ పీఆర్ సీ)

డ్రెస్సేజ్ చిల్డ్రన్ 2  విజేతలు :

1. ధృవ పోతినేని ( అశ్వ కలెక్టివ్ )

2. మైసా గుప్తా ( హెచ్ పీఆర్ సీ)

3. వేదిక్ గూడూరి (హెచ్ పీఆర్ సీ)

4. అనన్య గుప్తా (హెచ్ పీఆర్ సీ)