16 August, 2026 | 1:46 AM

టీమిండియా పంద్రాగస్టు వేడుకలు

16-08-2026 12:39 AM

లంక గడ్డపై త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన గిల్

గాలే, ఆగస్టు 15: భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్ట్ శనివారం గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమైంది. అయితే ఇదే రోజు స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది 80వ స్వాతంత్య్ర ది నో త్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ జాతీయ జెండాను ఎగురవేయగా, ఆటగాళ్లు, సిబ్బంది జాతీయ గీ తం ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

గాలేలో జరుగుతున్న ఈ మ్యాచ్ భా రత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైనది. ఇది టీ మిండియా ఆడుతున్న 600వ టెస్ట్ మ్యాచ్. భారత్ 1932లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో తొలి టెస్ట్ ఆడింది. దాదాపు 94 ఏళ్ల ప్రయాణం తర్వాత 600 టెస్టుల మైలురాయిని చేరుకుంది. 600కు పైగా టెస్టులు ఆడిన జట్ల జాబితాలో భారత్ కంటే ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. దీంతో శ్రీలంకతో గాలే టెస్ట్ భారత క్రికెట్ చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది.