calender_icon.png 11 November, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా శాంతిఖని ఐదవ ఆలయ వార్షికోత్సవం..

11-11-2025 05:14:32 PM

- జీఎం రాధాకృష్ణ ప్రత్యేక పూజలు 

- గనిపై సహపంక్తిభోజనం

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిఖని ప్రాజెక్టులోని దుర్గామాత దేవాలయం ఐదవ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజా, హోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మందమర్రి జీఎం ఎన్ రాధకృష్ణ, ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ సభ్యుడు రేణీకుంట్ల ప్రవీణ్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వార్షికోత్సవానికి ముఖ్య అతిథులు వచ్చిన జీఎం రాధాకృష్ణ, ఎస్సిఎస్టీ కమిషన్ సభ్యుడు రేణీకుంట్ల ప్రవీణ్ లను అధికారులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంల ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్వో టూ జీ ఎం జి ఎల్ ప్రసాద్, ఎస్కే గ్రూపు ఏజెంట్ అబ్దుల్ ఖాదిర్, మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, గని సేఫ్టీ ఆఫీసర్ రాజు, బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసీఎం పాండురంగా చారి, శాంతిఖని వెల్ఫర్ ఆఫీసర్ రవికుమార్, శాంతిఖని ఆలయ కమిటీ సభ్యులు, శాంతిఖని, జీఎం కార్యాలయం అధికారులు, అన్ని యూనియన్ల ప్రతినిధులు, కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు.