17 April, 2026 | 2:10 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

సంక్షేమమైనా... సహాయమైనా పొంగులేటి ముందంజ

07-06-2025 07:57 PM

తుంబూరు దయాకర్ రెడ్డి..

ఖమ్మం (విజయక్రాంతి): సంక్షేమమైనా... సహాయమైనా అందించడంలో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) ముందంజలో ఉంటారని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి(In-charge Tumburu Dayakar Reddy) పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బారుగూడెం, గొల్లగూడెం, ఏదులాపురం, వరంగల్ క్రాస్ రోడ్డు, మద్దులపల్లి, జలగంనగర్, నాయుడుపేట, కేబీఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, రెడ్డిపల్లి, ముత్తగూడెం ప్రాంతాల్లో ఇటీవల మృతి చెందిన 20 మంది వ్యక్తుల కుటుంబాలను ఓదార్చి పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఒక్కో కుటుంబానికి రూ. 10వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రిగా ఒకవైపు ప్రభుత్వం తరుపున సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దరిచేర్చుతూనే... ఇంకోవైపు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లోనూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథబాబు, బాణోతు కిశోర్, భూక్యా సురేష్ నాయక్, బండి జగదీశ్, అజ్మీరా అశోక్ నాయక్, వెంపటి రవి, తమ్మినేని నవీన్, కందుకూరు వెంకట నారాయణ, యాకుబ్, తిప్పిరెడ్డి వీరా రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మహేశ్, బానోతు దివ్య తదితరులు పాల్గొన్నారు.