22-11-2025 08:16:09 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శనివారం మెట్ పల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో పట్టణ, మండలానికి చెందిన అరవై మూడు మంది లబ్ధిదారులకు ఎమ్మల్యే కోటాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని వరుస ఫిర్యాదులు వస్తున్నాయని, ఎవరైనా డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి. నేనే జైలుకు వెళ్త అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.