22-11-2025 08:31:29 PM
చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి.శంకర్ లింగం
మొయినాబాద్,(విజయక్రాంతి): పరిశోధనలు సమాజానికి దిక్సూచిలా ఉపయోగపడాలని చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి.శంకర్ లింగం పేర్కొన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ లో గల చైతన్య డిమ్డ్ టూబీ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ విభాగంలో "ఏ స్టడీ ఆఫ్ ఇన్వెంటరీ ప్రాబ్లమ్ యూసింగ్ స్టాక్ డిపెండెంట్ డిమాండ్"అనే పరిశోధన సిద్ధాంతానికి టి.వాణి మాధవికి పీ.హెచ్.డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) లభించగా.. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి.శంకర్ లింగం చేతుల మీదగా అధికారికంగా ప్రధానం చేశారు. ఈ పరిశోధన డాక్టర్ పి.ప్రణయ్ పర్యవేక్షణలో జరిగింది.
దీంతో వాణి మాధవిని ఛాన్సలర్, ఫౌండర్ డాక్టర్ సీ.హెచ్ వి.పురుషోత్తం రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్.సాత్విక రెడ్డిలు అభినందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి.శంకర్ లింగం మాట్లాడుతూ.. స్టాక్-ఆధారిత డిమాండ్ ను ఉపయోగించి జాబితా సమస్య యొక్క అధ్యయనం చేయడం చాలా శుభపరిణామం అని ఆయన అన్నారు. విద్య పరిశోధనలను సమాజానికి సంబంధితంగా ప్రభావంతంగా మార్చడం యొక్క ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య యం. రవీందర్, ఆచార్య క్రిస్టోఫర్, ఏ.రాజు, ఎస్.కవిత, బి.రాజేందర్ రెడ్డి, ఇ.జగదీష్ కుమార్, బి.హరి ప్రసాద్, డాక్టర్ పి.ప్రణయ్, గాదె రాంబాబు రెడ్డి, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.