calender_icon.png 22 November, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామూహిక వివాహాల ఉదారవాధికి ఘన సన్మాణం

22-11-2025 08:16:55 PM

అచ్చంపేట: ఎంతో వ్యయప్రయాసలకోర్చి సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమని వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం నాగర్ కర్నూల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జెమినీ సురేశ్, అధ్యక్షుడు కించే గిరిజాశంకర్ కొనియాడారు. అచ్చంపేటకు చెందిన కౌన్సిలర్ గోపిశెట్టి శివ, గాయత్రి దంపతలు తమ సొంత ఖర్చుతో ఇటీవల పట్టణంలోని ఓ పంక్షన్ హాల్లో సామూహిక వివాహాల వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 63 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు.

దీంతో వారిని అభినందిస్తూ శనివారం వీర శైవ లింగాయత్ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శాలువాతో సన్మానించారు. సామూహిక వివాహాలు చేయించడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని అభిలాషించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కెంచే రాజేష్ కుమార్, కోశాధికారి కళ్లపు రాజశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగరాజు, శంకర్, ఉపాధ్యక్షులు శంకర్ అచ్చంపేట లింగ బలిజ సంఘం సభ్యులు శివకుమార్, వీరేశం, కాశీనాథ్, శివయ్య, సరళ, అప్ప శివ కుటుంబ సభ్యులు గాయత్రి తదితరులు పాల్గొన్నారు.