22-11-2025 08:10:44 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): శనివారం రోజున స్థానిక సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ వెంకంపేట నందు స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ సిరిసిల్ల మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందమందికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మాస్టర్ రాజేశం గోదావరిఖని విచ్చేయడం జరిగింది. అలాగే ట్రెజరర్ మాస్టర్ సయ్యద్ యాకూబ్ వరంగల్ విచ్చేశారు. మాస్టర్ రాములు, కదీర్,సాజిద్,రావడం జరిగింది ఇట్టి దేహదారుఢ్య పరీక్షల కార్యక్రమానికి ముఖ్య పరిశీలకులుగా మాస్టర్ రాజేశం వ్యవహరించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమాన్ని మాస్టర్ రాజేశం జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించడం జరిగింది. ఇట్టి దేహదారుఢ్య పరీక్షలు ఎల్లో బెల్ట్ నుండి బ్లాక్ బెల్ట్ వరకు నిర్వహించడం జరిగింది. కుంగ్ ఫు విద్యార్థిని విద్యార్థులు చేసిన విన్యాసాలు,కటాస్, హ్యాండ్ మూమెంట్స్, నాంచాక్, డబల్ నాంచాక్, స్టిక్, స్వార్డ్, టోన్ఫా ఫిట్ లు చాలా అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. వివిధ రకాల బెల్టులు పొందిన వారి వివరాలు. బ్లాక్ బెల్ట్ విభాగం జోర్రిగల వేణు, గజ్జెల శ్వేదిక, లింగం శ్లోక, కంచర్ల శ్రీనిక, కొండ శ్రీరామ్ లు బ్లాక్ బెల్ట్ సాధించారు అలాగె బ్రౌన్ బెల్ట్ విభాగంలో కోడం చైతన్య గౌతమ్ఆనంద్, జావ్వాజీ అబిమన్యు, అజయ సాయి, జయసాయి, గౌరవ్, యుతిక, శ్రీతిక్, ఎల్లే ప్రణవి, అస్లాం, కౌశిక్ లు సాధించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.