22-11-2025 08:14:24 PM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వీరభద్ర రావు యాదవ్ ను మరిపెడ యాదవ్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై వీరభద్ర రావు యాదవ్ మాట్లాడుతూ... యాదవులు కల్మషం లేని వారని ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారని మాట ఇచ్చి తప్పరని నమ్మకాని మారుపేరుగా చరిత్రలు వున్నాయని కాల క్రమేనా గుర్తింపుకు నోచుకోవడం లేదని అది యాదవ్ సోదరులు గమనించి అందరు కలిసి కట్టుగా వుండి పూర్వ వైభవం వచ్చేలా అందరు కలిసి వునడాలని యాదవ్ యువకులు అన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో రాణించి పేరు ప్రక్యాతలు సాదించుకోవాలని అన్నారు. పార్టీ లకతీతంగా న్యాయబద్ధంగా పనిచేయాలని యాదవ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మరిపెడ మండల యాదవ సంఘ నాయకులూ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.