21-08-2025 01:29:18 AM
కన్నాయిగూడెం, ఆగస్టు20(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన మడే రాజబాబు ఈ నెల పదో తారీఖున కత్తి పోటుకు,గురై మరణించారు మృతుని కుటుంబానికి మంత్రి సీతక్కగా ఆదేశాల మేరకు కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు ఎండి అప్సర్ పాషా ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.
ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎల్లపుడు తోడు ఉంటామని మనో దైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు 50 కేజీలు బియ్యం 6వేల రూపాయలు ఆర్థిక సహాయం అదించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా గ్రామ కమిటీ అధ్యక్షులు డేగల బాణయ్య మాజీ సర్పంచ్ సిద్దబోయిన సాగర్ మండల బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం నాగేశ్వరావు కాంగ్రెస్ సినియర్ నాయకులు గాయం రాజబాబు మాచర్ల బాబు పల్ల లచ్చబాబు పల్ల శ్రీను డేగల లక్ష్మయ్య గ్రామ తల్లడి లక్ష్మయ్య యూత్ నాయకులు గాయం రవీందర్ తోట వెంకటేష్ గడ్డం రవీందర్ గుట్ట బిక్షపతిపాల్గొన్నారు.