21-08-2025 01:29:17 AM
- రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు
- 2025, డిసెంబర్ 1 నుంచి రెండేండ్ల కాలానికి లైసెన్స్
- టెండర్లకు గెజిట్.. త్వరలోనే ఎక్సైజ్ శాఖ ప్రకటన
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల కోసం ప్రభు త్వం బుధవారం గెజిట్ విడుదల చేసింది. కాగా ఈ ఏడాది దరఖాస్తు ఫీజును మాత్రం రూ.లక్ష మేర పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా, దాన్ని రూ. 3 లక్షలకు పెంచింది.
దరఖాస్తు ఫీజును దరఖాస్తుదారులకు తిరిగి ఇవ్వరు. ఈ ఏడాది నవంబర్ 30 తో వైన్‌షాపుల టెండర్ గడువు ముగియనుండటంతో 2025, డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. 2025, డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేండ్ల పాటు మద్యం షాపులు నడుపుకొనేందుకు ఎక్సైజ్ శాఖ లైసెన్స్ ఇవ్వనుం ది. రాష్ట్రంలో దాదాపు 2,620 వైన్‌షాపులు ఉండ గా, వీటికి వచ్చే దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.3,500 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా. ఈ మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి త్వరలోనే నోటిఫి కేషన్ విడుదల కానుంది.
5 వేల జనాభాకు ఏడాది ఫీజు రూ.50 లక్షలు..
2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల జనాభా కలిగిన ప్రాంతంలో రూ.50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో షా పులకు రూ.60 లక్షలు, లక్ష నుంచి 20 లక్షల జనా భా కలిగిన ప్రాంతాల్లో షాపులకు రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభాన్న ప్రాంతాల్లో 1 కోటి 10 లక్షల చొప్పున మద్యం షాపు దక్కించుకున్న యజమాని ఏడాదికి సర్కార్‌కు చెల్లించాల్సి ఉం టుంది.
అదనంగా మరో రూ.5 లక్షలు చెల్లిస్తేనే వాక్‌లిక్కర్ స్టోర్ పెట్టుకోవడానికి అనుమతి ఇస్తుం ది. జీహెచ్‌ఎంపీ పరిధిలోని మద్యంషాపులు ఉద యం 10గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, జిల్లాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలను నడుపుకొనే అవకాశం ఉంటుందని గెజిట్‌లో పేర్కొంది.