01-07-2025 01:07:31 AM
మునిపల్లి, జూన్ 30 : మండలంలోని చిన్నచల్మెడ గ్రామానికి చెందిన అమీరొద్ధిన్ అనే వ్యక్తి గత రెండు నెలల క్రితం కరెంటు షాక్ తో మృతి చెందిన విషయం తెలిసింది. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తి త్రిష దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన త్రిష బాధిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని రాజనర్సింహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పెద్ద గోపులారం మాజీ ఎంపిటిసి పాండులు సోమవారం బాధిత కుటుంబాల సభ్యులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ, త్రిషకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రుద్ర కృష్ణ, పరమేశ్వర్ , బాలకృష్ణయ్య, సంగన్న, నరసింహులు, శ్రీధర్, గడ్డమీద రాములు తదితరులుపాల్గొన్నారు.