01-07-2025 01:08:41 AM
జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 30: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి హాజరై బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అంతకు ముందు అని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి గతంలో సేకరించిన దరఖాస్తులను పరిష్కరించిన తీరును అడిగి తెలుసుకున్నారు.
ప్రతి బాధితుని సమస్యకు తక్షణ పరిష్కారం చూపించాలని ఆదేశించారు. సోమవారం భూ సంబంధిత, పెన్షన్ సమస్యలు అధికంగా నమోదు కాగా మొత్తం 189 దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.