బాల్య స్నేహితురాలికి ఆర్ధిక చేయూత
25-03-2026 07:48 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 విద్యాసంవత్సరములో పదవ తరగతి చదివినటువంటి మోర్సుగూడెం గ్రామానికి చెందిన సుర్కంటి శోభ భర్త ఇటీవల మరణించగా, విషయం తెలుసుకున్న పూర్వవిద్యార్థులు తమ స్నేహితురాలికి ధైర్యాన్నిచ్చి.. అండగా నిలవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా పూర్వ విద్యార్థులకు సమాచారం చేరవేసి తోచినంత నగదును సమకూర్చారు. సమకూరిన రూ 60,000/- నగదును అందచేశారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్న అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో 2002-03 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.




