నిబంధనల ప్రకారం వాహనదారులు వాహనాలు నడపాలి
తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్
తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో అవహన డ్రైవర్లకు అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలకు వివరించిన తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రయాణ సమయంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే ప్రమాదాలు నివారించవచ్చునని తెలిపారు.
ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు తీసుకునే జాగ్రత్తలు శ్రీరామరక్ష అని ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యాన్ని చేరుకోవాలని కోరారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని కోరారు. డిఫెన్స్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమనిస్తానాలు చేరుకోవచ్చని తెలిపారు. నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలని అన్నారు. పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని ,ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని ప్రమాదాలకు కారణం కాకూడదని కోరారు. లేనియెడల జైలు జీవితాన్ని అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు




