11 May, 2026 | 4:32 AM

షార్ట్ సర్క్యూట్‌తో హోటల్‌లో అగ్నిప్రమాదం

11-05-2026 02:56 AM

పటాన్‌చెరు, మే 10 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు బస్టాండ్ సమీపంలోని ఖానావళి హోటల్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి హోటల్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్లకు అంటుకున్నాయి. రెండు సిలిండ ర్లు పేలడంతో మంటలు ఉధృతం అయ్యాయి. సిబ్బందిని బయటకు పంపించడంతో ముప్పు తప్పింది. సుమారు రూ.4 లక్షల వర కు ఆస్తినష్టం వాటిల్లింది.