07-12-2025 12:00:00 AM
ఘట్‌కేసర్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజారెడ్డి (24) అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. గురువారం రాత్రి అల్బనీ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మం డలం సముద్రాల ప్రాంతం గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్‌రెడ్డి హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
ఆయన భార్య శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీగా పనిచేశారు. ఇటీవల డిప్యుటేషన్‌పై హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం వారు ఘట్‌కేసర్ పరిధిలోని జో డిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్నారు. జయాకర్‌రెడ్డి, శైలజ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోనే బీబీఎస్ కోచింగ్ తీసుకుంటోంది. పెద్ద కూతురు సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదువు కోసం అమెరికా వెళ్లింది.
అల్బనీ ప్రాంతంలో సహజారెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్కనున్న మరో భవనంలో అగ్నిప్రమాదం జరిగి, అక్కడి నుం చి మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న స హజారెడ్డి.. మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. చదువు పూర్తి అవుతున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం ఆమెను బలితీసుకుంది.
ప్రతిరో జూ వీడియో కాల్‌లో మాట్లాడే తమ కూతురు ఇక లేదన్న వార్త తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సహ జారెడ్డి మృతి విషయం తెలియడంతో శ్రీనివాస కాలనీలో వి షాదం అలముకుంది. ఆమె మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నామని అ వసరమైన సాయం అందిస్తామని పేర్కొంది.