calender_icon.png 22 June, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెమికల్ ట్యాంకర్‌లో అగ్ని ప్రమాదం

11-06-2025 12:11:40 AM

మేడ్చల్, జూన్ 10 (విజయ క్రాంతి): బోల్తాపడిన కెమికల్ ట్యాంకర్ ను క్రేన్ సా యం తో తొలగిస్తుండగా ఒక్కసారిగా మం టలు చెలరేగిన ఘటన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అవుటర్ రింగ్ రోడ్డు పైనుంచి కెమికల్ ట్యాంకర్ సోమవారం కింద పడింది .మంగళవారం ఉద యం క్రేన్ సాయంతో ట్యాంకర్ ను తొలగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో అప్రమత్తమై సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. మే డ్చల్ ట్రాఫిక్ పోలీసులు అటువైపు వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశా రు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.