17 April, 2026 | 3:27 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అమ్మ బాటను విజయవంతం చేయాలి

11-06-2025 12:10 AM

నారాయణపేట.జూన్ 10(విజయ క్రాంతి) : జిల్లాలో అమ్మ మాట  అంగన్వాడీ బడిబాట కా ర్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ సూచించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు.

అంగన్ వాడీ కేంద్రాల పరిధిలో ప్రీస్కూల్ నమోదు కోసం ర్యా లీ నిర్వహించాలని, ప్రైవేట్ ప్రీస్కూల్ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.పిల్లల తల్లిదండ్రులు మరియు తాతా అమ్మమ్మలు అందరూ ర్యా లీలో పాల్గొనేలా చేయాలన్నారు. ముఖ్యంగా అంగన్ వాడీ కేంద్రాలలో వంటగదిలోని పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. అందుబాటులో ఉన్న ప్రదేశాలలో పోషణ్ వాటిక కోసం సిద్ధం చే యాలని సూచించారు. అన్ని ప్రీస్కూల్ సామగ్రిని ప్రదర్శించాలన్నారు.

అంగన్వాడీలతో సెల్ఫీ - తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విఐపి లతో సెల్ఫీ తీసుకోవాలన్నారు. బుధవారం కోసం ఎగ్ బిర్యానీ మెనూను అనుసరించాలని చెప్పారు. కొత్త నమోదు కోసం ప్రీస్కూల్ పిల్లల గృహ సందర్శనలను చేయాలన్నారు. ప్రీస్కూల్ లర్నింగ్ కార్నర్ ను తయారు చేయాలని, కేంద్రాలలో బాలలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలని ఆయన సూచించారు.

కేంద్రాలలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించి, ప్రీస్కూల్ పుస్తకాలను ప్రదర్శించి, పూర్వ ప్రాథమిక విద్య గురించి తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. విధిగా కేంద్రాలకు పిల్లలను పంపించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ సన్మాన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లు, సూపర్ వైజర్లు తదితరులుపాల్గొన్నారు.