17 April, 2026 | 12:09 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

భూ నిర్వాసితులకు చెక్కులు అందజేత

11-06-2025 12:12 AM

దేవరకొండ, జూన్ 10: దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయలో పెద్దగట్ట 10మంది లబ్ధిదారులకు 13లక్షల రూపాయలు, అంబా భవాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న 32 లక్షల రూపాయల విలువ గల నష్టపరిహార చెక్కులను 30మంది లబ్ధిదారులకు రెవెన్యూ , ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న వారి పునరావాసం కొరకు చింతపల్లి గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం సేకరించిన భూములకు ఆయా రైతులకు ప్రభుత్వం నుంచి 84లక్షల రూపాయల విలువ గల నష్టపరిహారం చెక్కులను 09 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని,ఈ ప్యాకేజ్ ద్వారా భూ నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారి జీవనోన్నతికి అవసరమైన సహాయ సహకారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు.

భూములు కోల్పోయి నష్టపరిహారం రాని రైతులకు, భూనిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్సీ భద్రు, ఈఈ నెహ్రూ నాయక్, రాములు నాయక్, ఆర్డిఓ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.