27 August, 2026 | 8:57 AM

కరీంనగర్ RTC ఈ-బస్సులో అగ్నిప్రమాదం.. డ్రైవర్ అప్రమత్తతో 41 మంది ప్రయాణికులు సురక్షితం

22-06-2026 01:04 AM
  1. బ్యాటరీ పేలి అంటుకున్న మంటలు
  2. మంటల్లో కాలిపోయిన బస్సు
  3. డ్రైవర్ అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ 41 మంది ప్రయాణికులు
  4. కరీంనగర్ పరిధిలోని అలుగునూరు వద్ద ఘటన

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న RTC ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సులో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి 41 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనపై RTC ఉన్నతస్థాయి సాంకేతిక విచారణకు ఆదేశించింది.

కరీంనగర్, జూన్ 21 (విజయక్రాంతి): కరీంనగర్ నుంచి హై దరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఉదయం ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్  సమయస్ఫూర్తితో 41 మంది ప్రయాణికులు సురక్షితం గా బయటపడ్డారు. కరీంనగర్ డిపో చెందిన ఈ-గరుడ బస్సు ఆదివారం ఉదయం కరీంనగర్ బస్టాండ్ నుంచి 41 మం ది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. కరీంనగర్ దాటి అలుగునూరు సమీపంలోని కాకతీయ ప్రధాన కాలువ వంతెన వద్దకు చేరుకోగానే, బ్యాటరీ  ఇంజిన్ క్యాబిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలు వచ్చి మంటలు చెలరేగాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

అయితే వెనుక వైపు నుంచి వస్తు న్న పొగలను డాష్ బోర్డ్ హెచ్చరికలను గమనించిన డ్రైవర్ ప్రశాంత్ ఆలస్యం చేయకుండా బస్సును రాజీవ్ రహదారి పక్క న నిలిపివేశారు. ప్రయాణికులను ప్రధాన, అత్యవసర ద్వారాల నుంచి కిందికి దించాడు. ప్రయాణికులంతా కిందకు దిగిన నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ పేలడంతో మంటలు బస్సు మొత్తం  వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. కరీంనగర్ అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మం టలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ ఎండీ ఉన్నత స్థాయి సాంకేతిక విచారణకు ఆదేశించారు.

RTC ఈ-బస్సులో అగ్నిప్రమాదం ఎక్కడ జరిగింది?

కరీంనగర్ జిల్లా అలుగునూరు సమీపంలోని కాకతీయ ప్రధాన కాలువ వంతెన వద్ద ఈ ఘటన జరిగింది.


బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు?

మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.


అగ్నిప్రమాదానికి కారణం ఏమిటి?

ప్రాథమిక సమాచారం ప్రకారం బ్యాటరీ ఇంజిన్ క్యాబిన్‌లో సాంకేతిక లోపం, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.


RTC ఏ చర్యలు తీసుకుంది?

ఘటనపై RTC ఎండీ ఉన్నత స్థాయి సాంకేతిక విచారణకు ఆదేశాలు జారీ చేశారు.


ఎలక్ట్రిక్ బస్సులు సురక్షితమేనా?

ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆధునిక భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, బ్యాటరీ నిర్వహణ, సాంకేతిక తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించడం అవసరం.

FAQ's

Q1. RTC ఈ-బస్సులో అగ్నిప్రమాదం ఎప్పుడు జరిగింది?

జూన్ 22 ఉదయం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో జరిగింది.

Q2. ఎంత మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు?

డ్రైవర్ సమయస్ఫూర్తితో 41 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Q3. బస్సు పూర్తిగా కాలిపోయిందా?

అవును. బ్యాటరీ పేలిన తర్వాత మంటలు బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా కాలిపోయింది.

Q4. అగ్నిమాపక సిబ్బంది ఏం చేశారు?

రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Q5. ఘటనపై విచారణ జరుగుతుందా?

అవును. RTC ఉన్నతాధికారులు సాంకేతిక విచారణకు ఆదేశించారు.