04-10-2025 02:40:48 AM
కల్వకుర్తి/ వికారాబాద్ సెప్టెంబర్ 3: నాగర్ కర్నూల్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని వంగూరు మండలం కొండా రెడ్డిపల్లిలో గురువారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి హైదరాబాదు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హెలికాప్టర్‌లో కొండారెడ్డి పల్లి గ్రామానికి చేరుకున్నారు. హెలిఫ్యాడ్ నుంచి ప్రత్యేక వాహనంలో హనుమాన్ ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. అనంతరం ముఖ్య మంత్రి సన్నిహితులతో దశలవారీగా సమావేశాలు నిర్వహించారు.
కొడంగల్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులను ఆయన ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. సొంత నియోజక వర్గానికి సీఎం రావడంతో పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ము ఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, స్థానికులు. ప్రతీ ఒక్కరిని కలుస్తూ ఆప్యాయంగా పలకరించారు. సాయంత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన జమ్మి కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు ధరించి తన మనవడితో కలిసి పూజలో పాల్గొన్నారు.
గ్రామస్తులకు అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రాకతో గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిని గ్రామస్తులు, బం ధువులు కలిసేందుకు భారీగా తరలివచ్చారు. రాత్రి వరకు గ్రామంలోనే ఉండి ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలు తనను కలిసేందుకు అవకాశం ఇచ్చారు. కార్యక్ర మంలో జిల్లా ఉన్నతాధికారులు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ కెవిఎన్ రెడ్డి, కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.