calender_icon.png 21 December, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డెరబస్తీలో అగ్నిప్రమాదం

21-12-2025 12:00:00 AM

  1. గ్యాస్ సిలిండర్ పేలి అంటుకున్న మంటలు
  2. తాళ్ల సాయంతో ఏడుగురిని కాపాడిన పోలీసులు

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీ స్ స్టేషన్ పరిధిలో ఉన్న వడ్డేర బస్తీలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగిం ది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని మం టలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, మొదటి అంతస్తులో చిక్కుకున్న ఏడుగురిని పోలీసులు, ఫైర్ సిబ్బంది తాళ్ల సాయంతో రక్షించారు.