calender_icon.png 3 July, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేనే బీఆర్ఎస్.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

03-07-2025 01:18:47 PM

జులై 17న రైల్ రోకో

బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ సహకరిస్తోంది.. నేనే బీఆర్ఎస్

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల(BC Reservations) సాధన కోసం జులై 17న రైల్ రోకోకు పిలుపు ఇచ్చామని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇంకా తీసుకెళ్లలేదని కవిత చెప్పారు. బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదని కవిత పేర్కొన్నారు.

బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjun Kharge)కి లేఖ రాస్తున్నామని ఎమ్మెల్సీ కవిత సూచించారు. జులై 8లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లోని బీసీ నేతలు  రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) సహకరిస్తోంది.. నేనే బీఆర్ఎస్ అని కవిత తేల్చిచెప్పారు. గోదావరి-బనకచర్ల విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని కవిత ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబును(AP CM Chandrababu) ఒక్క మాట కూడా అనలేదు.. చంద్రబాబు కోవర్టులు కాంగ్రెస్ లో ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్తున్నారని ఆమె తెలిపారు.