03-07-2025 12:55:11 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణ పరిధిలోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రైటర్ బస్తి , భవిత కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Bhadradri Kothagudem Collector Jitesh V Patil) అకస్మికంగా సందర్శించారు. మొదట రైటర్ బస్తి పాఠశాలలో 3, 4 తరగతులు చదువుతున్న విద్యార్థుల పఠనా సామర్థ్యాలను, విద్యార్థులు రాసిన రాత పుస్తకాలను పరిశీలించారు. అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది బోధన విధానాలను పరిశీలించారు. సామాగ్రి అంతా అందుబాటులో ప్రదర్శితంగా ఉండాలని సూచించారు. భవిత క్యాంపు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్ ప్రభుదయాల్ పాల్గొన్నారు.