calender_icon.png 1 May, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మేడే సంబరాలు

01-05-2025 02:43:18 PM

కల్లూరు,(విజయక్రాంతి): రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(Trade Union Centre of India) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎర్ర జెండాల రెపరెపల నడుమ కార్మిక సంఘాల 139వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి జండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా అధ్యక్షులు వెంకన్న మాట్లాడుతూ... కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని అన్నారు.

కార్మిక సంఘాల నాయకులు రక్త తర్పణ, జైలుకెళ్లి, హింసించబడి, పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం, నాలుగు కోడ్ లుగా విభజించి కార్మికుల శ్రమను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.అవి అమలులోకి వస్తే   కార్మికులు రోడ్డున పడే దుస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంట్రాక్ట్ కార్మికులకు రిటైర్డ్ అయిన తర్వాత 9 వేలు పెన్షన్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెనుకకు తీసుకోవాలని,నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ కార్యదర్శి సీతారాములు, సత్యం, మంగన్న, పరిమళ, మాల్యాద్రి, పున్నయ్య కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.