calender_icon.png 1 May, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగణనలో కులగణన.. సీఎంకు అభినందనలు వెల్లువ

01-05-2025 02:38:07 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): భారతదేశంలో నిర్వహించే జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పలువురు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. చట్టపరమైన ఎలాంటి చిక్కులు ఎదురుకాకుండా శాస్త్రీయ పద్ధతిలో దేశంలో కులగణన పూర్తి చేసిన ఘనత తెలంగాణకు దక్కుతుందని, ఇది దేశానికి రోల్ మాడల్‌గా ఉంటుందని వారు ముఖ్యమంత్రితో అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సలహాదారు కే.కేశవరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాజకీయ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. తెలంగాణలో విజయవంతంగా కుల గణన పూర్తి చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి రావడం సంతోషకరమైన పరిణామంగా వారు పేర్కొన్నారు.

ఇదెలా ఉండగా దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో భాగంగా కులగణన కూడా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ కేంద్రంతో కులగణనపై పోరాటం చేశారు. అందుకు తెంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసినందుకు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆలస్యంగానైనా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర క్యాబినెట్‌ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఏడాదిన్నరలో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధించిన విజయమని సంతోషం వ్యక్తం చేశారు.