14-01-2026 02:01:31 PM
అల్వాల్: హైదరాబాద్‌లో బుధవారం అగ్నిప్రమాదం(Fire broke out) చోటుచేసుకుంది. అల్వాల్‌లోని ట్రూ వ్యాలీ కార్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనలో అనేక కార్లు దగ్ధమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.