calender_icon.png 14 January, 2026 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు నిలయం

14-01-2026 04:06:48 PM

 మట్టిపల్లి సైదులు 

మోతే,(విజయ క్రాంతి): తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు నిలయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు  అన్నారు. బుధవారంమండల పరిధిలోనిసిరికొండ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో పాల్గొని విజయం సాధించిన మహిళలకు ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సైదులు మాట్లాడుతూ మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒక్కటి అన్నారు. మహిళలు దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడం కోసం ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగు సంస్కృతి ఉట్టి పట్టేలా సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించడం అన్నారు.

ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు  అందజేశారు. ఈ కార్యక్రమంలోతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలుజంపాల స్వరాజ్యం,వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర పోతయ్య, మండల కమిటీ సభ్యులు  బోడ పట్ల హుస్సేన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కెనపల్లి వినయ్, విద్యార్థి నాయకురాలు మట్టిపల్లి మానస, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు కటారి పార్వతమ్మ, కుంటి గొర్ల గంగమ్మ, చిట్యాల పద్మ, జంపాల ఉప్పయ్య, అక్కెనపల్లి నాగమ్మ, బోడ పట్ల సాంబమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.