calender_icon.png 14 January, 2026 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

95 సర్వే నెంబరు తాండూర్ గ్రామస్తులకు సర్టిఫికెట్ ఇవ్వాలి

14-01-2026 04:03:09 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): 95 సర్వే నెంబర్ గల భూమికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వాలని తాండూర్ గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ఆర్డీవో పార్థసింహారెడ్డిలకు కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తాండూర్ గ్రామస్తులు గత సుమారు 75 సంవత్సరాలుగా తాండూర్ ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కొన్ని స్థలాలను మాఆధీనంలో ఉంచుకొని వాటిలో గడ్డివాములు,పెంట కుప్పలు నిరంతరంగా వినియోగించుకుంటున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఈ స్థలాలు సుమారు 60 మంది కుటుంబాలకు జీవన ఆధారంగా మారాయని, ఈ స్థలలకు సంబంధించిన సర్వేనెంబర్ 95 కాగా ఇప్పటికే  స్థలాలను యధావిధిగా వినియోగించుకుంటున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే ఇటీవల అక్కంపల్లి గ్రామ సర్పంచ్ ఇంటి స్థలానికి సమీపంలో ఉన్న 95 సర్వే నెంబర్ గల స్థలాలను అక్కంపల్లి గ్రామపంచాయతీ నూతన భవనిర్మానం పేరుతో స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తాండూరు గ్రామస్తులు వినతి పత్రం ద్వారా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు వివరించారు.

గ్రామపంచాయతీ నిర్మాణానికి ఇప్పటికే మూడు స్థలాలు ఉన్నాయని అక్కంపల్లి గ్రామస్తులు కావలసి కబ్జాలో వాడకంలో ఉన్న స్థలాలను అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తాండూర్ కిచ్చన్నపేట గ్రామానికి చెందిన వారమనే అనే కారణంతో 95 సర్వే నెంబర్ గల స్థలాలను ఉద్దేశపూర్వకంగా ఆక్రమించుకొని మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దానివల్ల జీవన ఉపాధి ప్రమాదంలో పడుతుందని అంటున్నారు.కావున దయచేసి స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు,ఆర్డీవో పార్థసింహారెడ్డిలు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని వేడుకున్నారు.గత ఎన్నో శతాబ్దాలుగా వినియోగిస్తున్న ఈ స్థలాలపై అన్యాయాన్ని నివారించి మాకు న్యాయం చేయాలని వినతి పత్రంలో పేర్కొంటూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,ఆర్డిఓ పార్థసింహారెడ్డిలకు వినతి పత్రాన్ని అందజేశారు.