14-01-2026 03:01:45 PM
హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటించారు. శనిగరం చెరువులో రొయ్య పిల్లలను వదిలి, చెరువుల్లో ప్రభుత్వమే చేపలు, రొయ్యలు విడుదల చేస్తుందని మంత్రి పొన్నం చెప్పారు. రాజీవ్ రహదారిపై ఫిష్ మార్కెడ్ పెట్టాలని ప్రతిపాదనలు చేశానని, స్థల సేకరణ జరగగానే ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తా అని ఆయన పేర్కొన్నారు.