14-01-2026 04:28:42 PM
హైదరాబాద్: ములుగు జిల్లా రద్దవుతోందన్న ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రచారంపై ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ములుగు జిల్లా ఎక్కడికి పోదని, ఇక్కడే ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు. ములుగు జిల్లా ఏర్పాటు కోసం పోరాడిన వాళ్లమని, అలాంటిది ఎందుకు రద్దు చేస్తాం..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, ప్రజాభిప్రాయాలు తెలుసుకోకుండా జిల్లాల సరిహద్దులు నిర్ణయించారని మంత్రి మండిపడ్డారు.
ములుగులోని ఐదు గ్రామాలు భూపాలపల్లిలో ఉన్నాయని, అలాంటప్పుడు ప్రజలకు పాలనా ఫలాలు ఎలా అందుతాయి..? అని అడిగారు. రెవెన్యూ, పోలీసు సరిహద్దుల విధానాన్ని కేసీఆర్ అవలంబించలేదని ఆగ్రహించారు. జిల్లాల సరిహద్దు ప్రజలు రెడు కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని, అందుకోసమే జిల్లాల విషయంలో స్వల్పమార్పులు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు. ములుగు జిల్లా నచ్చనివాళ్లే జిల్లా రద్దవుతోందని ప్రచారం చేస్తున్నారని చెప్పినట్లు మంత్రి సీతక్క దుయ్యబట్టారు.