ఆల్‌టైం ‘ట్రాక్’ రికార్డు!
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): రైల్వే ట్రాక్ నిర్మాణంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు నెలకొల్పింది. గత ఆర్థిక సంవత్స రం లో మొత్తం 416 కి.మీ మేర ట్రాక్ నిర్మాణం తో రైల్వే జోన్ ప్రారంభం నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ట్రాక్ జోడింపుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఫలితంగా రైల్వే జోన్ ఊహించని విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో దూసుకుపోతోంది. జోన్ ట్రాక్ సామర్థ్యం పెంపుతో రైల్వే ప్రయాణికులను చేరవేయడంలోనూ, సరుకు రవాణాలోనూ జోన్ ప్రగతి సాధించేందుకు అవకాశం ఏర్ప డుతోంది. కొత్త ట్రాక్‌ల నిర్మాణం వల్ల రైళ్ల రాకపోకల ఆలస్యానికి చెక్ పెట్టేందుకు అవ కాశం ఏర్పడుతుంది. కొత్త రైళ్ల రాక పోకల కు, సరుకు రవాణాకు పెరిగిన ట్రాక్ సామ ర్థ్యం ఎంతో ఉపయుక్తంగా మారనుంది.
2023 ఆర్థిక సంవత్సరంలో ఊహించని ప్రగతి..
గత ఆర్థిక సంవత్సరంలో 39 కి.మీ మేర కొత్త లైన్ నిర్మాణం, 54 కి.మీ మేర గేజ్ మార్పిడి, 133 కి.మీ మేర రెండో లైన్లు, 190 కి.మీ మేర మూడో లైన్లు... మొత్తం కలిపి 416 కి.మీ రైల్ నెట్‌వర్క్‌కు జోడించడం జరి గింది. గత ఏడాది పలు రైల్వే ప్రాజెక్టులు ద.మ. రైల్వే చేపట్టింది. తెలంగాణలో మనో హరాబాద్ కొత్తపల్లి(కరీంనగర్) ప్రాజె క్టులో భాగంగా దుద్దెడ సిద్ధిపేట మధ్య 11కి.మీ, ఏపీలోని నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టులో భాగంగా గుండ్లకమ్మ దర్శి మధ్య 28 కి.మీ కలిపి మొత్తంగా 39 కి.మీ మేర కొత్త లైన్ పూర్తి చేశారు. ఇక గేజ్ మార్పిడి ప్రాజెక్టులో భాగంగా మధ్యప్రదేశ్ లోని ఆమ్లాఖుర్ద్ ఖాండ్వా మధ్య కీలకమైన 54 కి.మీ మేర పూర్తి చేశారు. విజయవాడ బైపాస్ లైన్ 5 కి.మీ, గుంటూరు గుంతకల్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా వివిధ విభాగాల్లో 133 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా సనత్ నగ ర్ మౌలాలీ మధ్య 21 కి.మీ నూతన ట్రాక్ నిర్మించారు. మూడో రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కాజీపేట విజయవాడ, కాజీపేట విజయవాడ గుంటూరు మధ్య 190 కి.మీ ట్రాక్ పూర్తి అయింది. మనోహ రాబాద్ నుంచి కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్‌లో భాగంగా ఇప్పటికి సిద్ధిపేట వరకు లైన్ వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో దుద్దెడ సిద్ధిపేట మధ్య 11 కి.మీ లైన్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడంతో సికింద్రాబాద్ నుంచి సిద్ధిపేట వరకు రెండు లోకల్ రైళ్లను నడుపుతున్నారు. సిద్ధిపేట నుంచి ఉదయం 6.45 గంటలకు, మధ్యా హ్నం 2.05 గంటలకు ఈ రైళ్లు సికింద్రా బాద్ బయలుదేరుతాయి. ఇక సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35గంటలకు, సాయం త్రం 5.45 గంటలకు సిద్ధిపేట వైపు రైళ్లు బయలుదేరి వెళ్తాయి. కొత్త లైన్ నిర్మాణం వల్లే సిద్ధిపేటకు రైలు వచ్చిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా సిద్ధిపేట నుంచి కొత్తపల్లి వరకు లైన్ నిర్మాణం పూర్తి చేస్తే కరీంనగర్ నుంచి సికింద్రాబాద్‌కు మరిన్ని రైళ్లు వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
అన్ని విభాగాల పనితీరుకు నిదర్శనం ఈ విజయం
ఒక ఆర్థిక సంవత్సరంలో 416 కి.మీ రైల్వే ట్రాక్ జోడింపు అనేది జోన్ చరిత్రలోనే ఓ రికార్డు. జోన్ పరిధిలోని అన్ని విభాగాలు ఎంతో సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. అత్యంత క్లిష్టమైన మౌలిక సదుపా యాల కల్పన వల్ల రైల్వే నెట్‌వర్క్ మరింత విస్తృతమై అటు ప్రయా ణీకులకు, ఇటు సరుకు రవాఱాకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ఇదే స్ఫూర్తితో జోన్ పరిధిలో మౌలి క వసతుల కల్పనకు కృషి చేస్తాం.
-అరుణ్ కుమార్ జైన్,
జీఎం, ద.మ రైల్వే జోన్






