22-05-2025 01:05:14 AM
- ఎన్వోసీ లేకుండానే విచ్చలవిడిగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు
- ఫైర్ సేఫ్టీ పాటించని ప్రైవేటు ఆసుపత్రులు పాఠశాలలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు
- భాగ్యనగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతోనైనా మేల్కొనేనా..?
నాగర్ కర్నూల్, మే 21 (విజయక్రాంతి)ః నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ల ని ర్మాణం రోజురోజుకు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. చూపరులను ఆకట్టుకునేలా ఫర్ని చర్ కర్టన్స్, ఏసీ రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిష న్స్ ఇతర ప్రమాదకర స్థాయిలో మంటలు అంటుకునే విధమైన డెకరేషన్లు సామాగ్రి ఏర్పాటు చేసుకుంటున్నారు.
కానీ ఎండల తీవ్రత, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ఏదై నా అనుకోని పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే అక్కడికి వచ్చే ప్రజలను కాపాడుకునేలా అగ్నిమాపక శాఖ విధించే నిబంధన లు మాత్రం పాటించడం లేదు. అనుమతులు పొందే క్రమంలోనే అగ్నిమాపక శాఖ నుండి ఎన్‌ఓసి ఉంటేనే అనుమతులిస్తామ ని చెప్పాల్సింది పోయి అందుకు తగిన ము డుపులిస్తే చాలు అనుమతులు ఇట్టే అందుతున్నాయనిఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా మారడంతో క్రమంగా ప్రైవేట్ పాఠశాలలు, కళా శాలలు, ఆస్పత్రులు, ఇతర షాపింగ్ కాంప్లె క్స్, రైస్ మిలల్స్, కాటన్ మిల్స్, రెసిడెన్షియల్ నిర్మాణాలు వేల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. కానీ కేవలం 20 వాటికి మాత్రమే ఫైర్ సేఫ్టీ అనుమతులు పొందడం విశేషం. మరో పదకొండు వాటికి రెన్యువల్ కూడా చేయాల్సి ఉంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆకాశాన్ని తాకే బిల్డింగులు ఇరుకు ఇరుకుగా ఎన్నో హంగులతో నిర్మాణం చేస్తున్నప్పటికీ సంబంధిత ఫైర్ సేఫ్టీ నిబంధనలు మాత్రం పాటించకపోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవి స్తుందో అన్న భయం అందరినీ వెంటాడుతుంది. జిప్లస్ ఫోర్ 15 మీటర్ల వరకు కమ ర్షియల్ కాంప్లెక్స్, జి ప్లస్ 5 రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 18 మీటర్ల నిర్మాణం కోసం ఫైర్ సే ఫ్టీ అధికారులు అనుమతులు తప్పనిసరి.
కానీ నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు ఆకాశాన్ని తాకే అంతస్తులు అక్రమంగా నిర్మితం అవుతున్నాయి. వాటితోపాటు జనావాసాల్లో కొన్ని దుకాణదారులు కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కి విషపూరితమైన పొగ కమ్ముకునే రసాయనాలు ఇతర వ్యర్ధాలు బట్టలు చెప్పులు ఇతర దుకాణాలు ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో నాగర్ క ర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తిలో ప్రభు త్వ అమ్రాబాద్ ఫైర్ స్టేషన్ ఆఫీస్ ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉన్నాయి. ఒక్కో స్టేషన్లో ఫైర్ స్టేషన్ ఆఫీసర్ తో పాటు ముగ్గురు డ్రైవర్లు ఇద్దరు జంధార్ లు, మరో 10 మంది జవాన్లు చొప్పున 15 మంది ఫైర్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీటిల్లో వాటర్ టెండర్ వాహనాలతో పాటు నాగర్ కర్నూల్ ఫైర్ స్టేషన్ కార్యాలయంలో అంబులెన్స్ ఫోర్స్ వాహనం, వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు బోటు కూడా అందుబాటులో ఉంది.
భాగ్యనగరంలో జరిగిన అగ్నిప్రమాదాలతోనైనా మేల్కొనేనా...?
హైదరాబాద్ లోని పాతబస్తీ గుల్బర్ హౌ స్ ఏసీ కంప్రెసర్ పేలిన ఘటనలో సుమారు 17 మంది అమాయకులు అగ్ని ప్రమాదం లో మృతి చెందిన విషయం తెలిసిందే. దాం తోపాటు మైనార్దేవపల్లి చర్లపల్లి వంటి ప్రదేశాల్లోనూ వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించిన విషయం తెలిసిందే. నేపథ్యం లో నాగర్ కర్నూల్ జిల్లాలోని పట్టణ కేంద్రా ల్లో ప్రైవేటు పాఠశాలలు, ఆసుపత్రులు ఇత ర కమర్షియల్ కాంప్లెక్స్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించకపోవడంతో ఎప్పుడు ఎ లాంటి ప్రమాదం సంభవిస్తుందో అన్న భ యాందోళన వ్యక్తం అవుతుంది.
ఆయా ము న్సిపాలిటీలలో నూతనంగా నిర్మితమవుతున్న భారీ అంతస్తులు సెట్ బ్యాక్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏవి పాటించక పో యినా వాటికి అనుమతులు ఎలా వ స్తున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయా అంతస్తుల నిర్మాణం లోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఫర్నిచ ర్, డోర్ కర్టెన్స్, మైక్రోవేవ్స్, ప్రమాదకరమైన కెమికల్స్, ప్లాస్టిక్ వంటి వినియోగం భారీగా పెరిగిందని అనుకోని ప్రమాదం జరిగితే వెదజల్లే దుర్వాసనతో అత్యంత ప్రమా దం సంభవిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
ఏదైనా అంతస్తు నిర్మాణం జరిగే క్రమంలోనే ము న్సిపల్ అధికారు లు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసి తప్పనిసరి కోరాలి అప్పుడే యాజమాన్యాలు ఫైర్ సేఫ్టీ నిబంధనలను అనుమతు లను పొందే అవకాశం ఉంది. జనం రద్దీగా ఉండే ప్రదే శాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రైవేటు ఆసుపత్రులు, పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ నిబంధన లు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నాం. ప్రమాదం జరిగితే సురక్షితంగా బయటపడే మార్గాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
గిరిధర్ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్, నాగర్ కర్నూల్.