22-05-2025 12:58:55 AM
- ఆర్‌ఎంపీలు, మధ్యవర్తుల కమీషన్ల దందా
- రిఫర్ చేస్తే ఒక్కో బిల్లుకు రూ.వేలల్లో వసూలు
- ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం
- సాధారణ జబ్బులకే రూ. వేలల్లో బిల్లులు
- ఆర్థికంగా కుదేలవుతున్న కుటుంబాలు
నల్లగొండ టౌన్, మే 21:వైద్యం వ్యాపారంగా మారింది. మారుమూల పల్లెల్లోనూ ప్రథమ చికిత్సలు అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీలు బడా ఆస్పత్రులతో సంబంధాలు పె ట్టుకుని ఏజెంట్లుగా వ్యవహరిస్తూ భారీగా కమిషన్లు దండుకుంటున్నారు. చిన్న రోగమై నా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే చాలు అవసరం లేకున్నా స్కానింగ్.. ఎక్స్రే.. రక్తప రీక్షలాంటూ రోగిని బెంబేలెత్తిస్తున్నారు. జి ల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో సైతం ఈ దందా యథేచ్ఛగా సా గుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులపై వైద్యశా ఖాధికారులు ఇటీవల దాడులు నిర్వహించినా ఈ కమీషన్ల దందాపై మాత్రం దృష్టి కేంద్రీకరించకపోవడం గమనార్హం. దందా తో అటు ఆర్‌ఎంపీలు, పీఎంపీలతో పాటు ఆసుపత్రుల యాజమాన్యం లక్షలు గడిస్తు న్నా రోగులు మాత్రం ఆర్థికంగా ఇల్లుగుల్ల చేసుకుంటున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో సుమారు రెండు,మూడు వందల వరకు ప్రైవేటు ఆసుపత్రులుండగా ఆర్‌ఎం పీ, పీఎంపీ పేరిట సుమారు రెండు వేల మందికి పైగా చలామణి అవుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు రోగులను పంపడం, అక్కడ అయిన బిల్లులో రావాల్సిన కమీష న్లు తీసుకోవడం నిత్య వ్యాపారంలా మారింది.
అవసరం లేకున్నా పరీక్షలు.. అడ్డగోలుగా మందులు..
గతంలో ఉన్న ఆసుపత్రులకు తోడు ఇటీవల పుట్టుకొస్తున్న ఆసుపత్రులు ఆర్‌ఎంపీల కు సిరి సంపదలను తెచ్చిపెడుతున్నాయి. అ టు ఆర్‌ఎంపీ, పీఎంపీలకు భారీగా కమీషన్లు ఇచ్చి ఇటు రోగుల జేబులకు చిల్లులు వే స్తు న్నారు. రోగుల ప్రాణాలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్న వైద్య వ్య వస్థపై ప్రజల్లో తీవ్రమైన అసహనం ఉన్నప్పటికీ ఏం చేయలేని పరిస్థితి. సాధారణ జబ్బుతో ఆసుపత్రికి వెళ్తే లేని పోని భయాందోళనలు సృష్టించి రోగిని ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తున్నారు.
లెక్క లేని పరీక్షలు చేయడం, అ వసరం లేకున్నా అడ్డగోలుగా మందులు ఇస్తూ రోగి జేబును గుల్ల చేస్తు న్నారు. ఆరోగ్యం బాగా లేక ఆసపత్రిలో చేరుతున్న రోగులకు బిల్లులు చూ సి మానసికంగా, ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఇంతటి దోపిడీ నల్లగొండ పట్టణంలోని ప లు ఆసుపత్రులు మొదలుకోని జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, చం డూర్, లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొ నసాగుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో సవ్యంగా వైద్యసేవలు అందుతున్న ప్పటికీ వ్యాపారదృక్పథంతో ఏర్పాటు చేసిన పలు ఆసుప త్రుల్లో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా మారింది.
ఎప్పటికప్పుడు పెంచుతున్న కమీషన్..
జిల్లాలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల దోపి డీ తారాస్థాయికి చేరింది. రోగిని దోచి ఆర్‌ఎంపీ, మద్యవర్తికి కొంత ఆసుపత్రి యాజ మాన్యం మరికొంత పంచుకుంటున్నారు. గతంలో రోగులను ఆసుపత్రులకు పంపే ఆర్‌ఎంపీలకు అడపాదడపా గిఫ్ట్లు ఇచ్చేవా రు. కానీ గడిచిన నాలుగైదు ఏళ్లుగా ఆర్‌ఎంపీలకు కమీషన్లు అడ్డగోలుగా పెంచేశారు. పోటాపోటీగా ప్రైవేటు యాజమాన్యాలు అ క్రమ సంపాదనకు ఆశపడి పలువురు ఆర్ ఎంపీలను ఏజెంట్లుగా, మద్యవర్తులుగా ని యమించుకుంటున్నారు.
ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో తీరుగా 15 నుంచి 20 శాతం కమీషన్లను అప్పజెపు తున్నారు. బహిరంగంగానే పలు ప్రైవేటు ఆసుపత్రులు మద్యవర్తులతో బేరసారాలు కుదుర్చుకుంటున్నాయి. ఆర్‌ఎంపీలు, మద్యవర్తులకు అ డ్వాన్స్లు చెల్లించి ప్రోత్సహిస్తుండడం గమనార్హం. ముందుగానే డబ్బులు చెల్లించి రోగుల బిల్లుల నుంచి వచ్చే కమీషన్ను అందులో నుంచి మి నహాయించుకుంటున్నారు. పలువురు ఆసుపత్రుల నిర్వాహకులు విదేశాలకు ట్రిప్లకు సైతం పంపిస్తున్నారంటే వ్యాపారం ఏ మేర కు నడుస్తుండో అర్థం చేసుకోవచ్చు.