04-01-2026 01:36:21 PM
టెస్ట్ ఫ్లైట్ ల్యాండైందంటే ప్రాజెక్టు చివరి దశ
మన ప్రాంత అభివృద్ధికి కేంద్ర సహకారం
హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని భోగాపురంలో(Bhogapuram International Airport) నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా దిగడంతో ఒక కీలక మైలురాయిని సాధించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఏటీసీ ఛైర్మన్ మరియు ఇతర అధికారులతో కూడిన ఈ విమానం ఢిల్లీ నుండి వచ్చింది. ప్రాజెక్టు డెవలపర్ అయిన జీఎంఆర్ గ్రూప్ ప్రకారం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడుతున్న ఈ విమానాశ్రయం 96 శాతం పూర్తయింది. ఈ విమానాశ్రయం జూన్ 26న ప్రారంభం కానుంది.
విమానాశ్రయం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచానికి పంపే వీలు ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister of Civil Aviation Rammohan Naidu) తెలిపారు. ఎయిర్ పోర్టు అంటే 2 వేల ఎకరాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదని తెలిపారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ బలపడానానికి అవకాశం లభిస్తోందని చెప్పారు. 18 నెలల్లోనే ఉత్తరాంధ్రలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించామని కేంద్రమంత్రి వెల్లడించారు. మరో నాలుగైదు నెలల్లో విమానాశ్రయం ప్రారంభి. విమానాశ్రయానికి సంబంధించి కీలక అంశాలన్నీ పూర్తయ్యాయని తెలిపారు. టెస్ట్ ఫ్లైట్ ల్యాండైందంటే ప్రాజెక్టు చివరి దశ.. అన్నీ పూర్తి చేసినట్లు సంకేతం అన్నారు. ఈ ప్రాజెక్టుతో వివిధ జిల్లాల ప్రజలు అనుసంధానం అవుతున్నారని చెప్పారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి అన్నారు. విమర్శలకు సమాధానంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అన్నారు. భవిష్యత్తుల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ కు కేంద్ర బడ్జెట్ లోనూ నిధులు కేటాయింపు జరుగుతోందన్నారు. మన ప్రాంత అభివృద్ధికి కేంద్ర సహకారం తీసుకుంటున్నామని రామ్మోహన్ తెలిపారు.