calender_icon.png 6 January, 2026 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అందజేత

05-01-2026 01:32:37 PM

వాంకిడి(విజయ క్రాంతి): పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ఆచూకీ కనుగొని సోమవారం బాధితుడికి అందజేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. వాంకిడి మండలం గోయగాం గ్రామపంచాయతీ, మహాగాంకి గ్రామానికి చెందిన ఎస్.కె. లతీఫ్ వాంకిడి మార్కెట్ ప్రాంతంలో తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. అదే రోజు స్థానిక వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి, సెల్‌ఫోన్ ఆచూకీని గుర్తించి స్వాధీనం చేసుకొని బాధితుడికి అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. సెల్‌ఫోన్ పోయిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.