calender_icon.png 6 January, 2026 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత కొత్త పార్టీ

05-01-2026 01:31:12 PM

 ఆశలు అడియాశలయ్యాయి.

అవమానంతో బయటకు వస్తున్నా

హైదరాబాద్: సమస్యలపై ప్రశ్నిస్తే అవమానకరంగా బయటకు పంపారని కవిత(kalvakuntla kavitha) తెలిపారు. ఉద్యమ ద్రోహులంతా బీఆర్ఎస్ పార్టీలో చేశారని కవిత ఆరోపించారు. ఉద్యమకారులకు పార్టీలో గౌరవం లేదన్నారు. లక్షల కోట్లు ఇరిగేషన్ కు ఖర్చు చేశారని, కానీ పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోయారని తెలిపారు. పార్టీలో ఎంతో మంది ఆశలు అడియాశలయ్యాయి. జాగృతి రాజకీయ పార్టీగా మారుతోందని కవిత వివరించారు. వచ్చే ఎన్నికల్లో జాగృతి పార్టీ పోటీ చేస్తోందన్నారు. ప్రజలపక్షాన మళ్లీ సభలో అడుగుపెడతామని తెలిపారు. కొత్త రాజకీయ వేదిక వస్తుంది అందరూ రావాలని యువతకు కవిత పిలుపునిచ్చారు.

మహిళల హక్కుల కోసం తనను దీవించాలని ఆమె కోరారు. ఇంటి పార్టీ నుంచి అవమానభారంతో బయటకు వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యంత అవమానకరంగా నన్ను బయటకు పంపారని కవిత పేర్కొన్నారు. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాం, సమస్యలపై పోరాడతామన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చే వేదిక జాగృతి అవుతుందని వెల్లడించారు. శాసనమండలి నుంచి కవతి నేరుగా గన్ పార్క్ కు వెళ్లారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు కవిత నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీపై కవిత తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది.