calender_icon.png 1 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితుడికి ఐదు రోజుల జైలు

01-01-2026 01:57:02 AM

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 31 : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తికి కోర్టు అయిదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సి ద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వ డ్లూరి బాబు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. గతం లో కూడా పట్టుబడి అప్పట్లో కోర్టు విధించిన చలానాను చెల్లించలేదు. రెండోసారి ప ట్టుబడిన అతడిని పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరుచగా, న్యాయమూర్తి జైలు శిక్ష విధించారని సిద్దిపేట టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు.