calender_icon.png 1 January, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడాకారుల ఎంపిక

01-01-2026 01:58:50 AM

కోచ్ కరణం గణేష్

చేగుంట, డిసెంబర్ 31: చేగుంటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జనవరి 2వ తేదీన అండర్ 15 సెమీ టాకిల్, అండర్ 18 టాకిల్ రగ్బీ పోటీలు ఉన్నాయని రగ్బీ కోచ్ కర్ణం గణేష్ రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లీశ్వరి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 2న ఉదయం 9 గంటల వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంకు రావాలని, అలాగే వారివెంట బోనాఫైడ్, ఆధార్ కార్డ్, టెన్త్ మెమో జిరాక్స్ కాపీలు, రెండు పాస్ ఫోటోసైజ్ ఫోటోలు తీసుకురావాలని తెలిపారు.

అండర్ 15లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2011, 2012, 2013 సంవత్సరంలో పుట్టినవాళ్ళు అర్హులని, అలాగే అండర్ 18లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2008, 2009, 2010లో జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఈ టోర్నమెంట్ లో ఎంపికైనవారు సూర్యాపేట జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. పూర్తి వివరాలకు 9666632023, 9573296 678, 9704240345, 8688355456 నంబర్లలో సంప్రదించాలని కోరారు.