25-07-2024 01:00:12 PM
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్ 2024-25 ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతులకు శుభవార్త చెప్పారు. రైతులు పండించే వరి సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని వెల్లడించారు. ఈ ఏడాది మార్చి వరకు 2,26,740 ధరణి అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయన్న ఆయన కొత్తగా 1,22,774 ధరణి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 1,79,143 దరఖాస్తులను పరిష్కరించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆయిల్‌పామ్ సాగుకు రైతులకు అవసరమైన సాయం చేస్తున్నామని, రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.