03-12-2024 01:04:54 AM
లుసాన్నే: డిసెంబర్ 26 నుంచి 31 వరకు న్యూయార్క్ వేదికగా జరిగే 2024 ఫైడ్ వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో ఐదుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు పాల్గొననున్నారు. భారత్‌కు చెందిన ప్రజ్ఞానంద, అర్జున్, వైశాలి, హంపి, హరిక పాల్గొంటారని ఫైడ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ తెలిపింది. ఈ టోర్నీలో తొలిసారి ఉత్తర అమెరికా పాల్గొంటోంది. ప్రపంచ నంబర్ 3 చెస్ ప్లేయర్, అమెరికన్ గ్రాండ్ మాస్టర్ నకముర కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నాడని చెస్ ఫెడరేషన్ తెలిపింది.
డిసెంబర్ 26 నుంచి మొదలు కానున్న ఈ టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా 300 మంది చెస్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఐదుసార్లు ప్రపంచ విజేత కార్ల్‌సన్ కూడా ఈ పోటీలో ఉన్నాడు. ఈ టోర్నీ ఏడాదికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఓపెన్ సెక్షన్, మహిళల సెక్షన్ అనే రెండు కేటగిరీల్లో ఈ టోర్నీ నిర్వహిస్తారు. 1.5 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రైజ్‌మనీ ఉండనుంది.