calender_icon.png 13 September, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుణెలో పోరు షురూ..

03-12-2024 12:56:21 AM

నోయిడాలో ముగిసిన కబడ్డీ కూత

పుణె: ప్రొకబడ్డీ రెండు లెగ్‌లు పూర్తి చేసుకుని పుణె లెగ్‌లోకి ప్రవేశించింది. నేటి నుంచి పుణె వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదట హైదరాబాద్ వేదికగా, ఆ తర్వాత నోయిడా వేదికగా మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరించాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో పాటు, ఫైనల్ మ్యాచ్ కూడా పుణెలోనే జరగనుంది. టోర్నీ ముగిసే వరకు కబడ్డీ లీగ్ పుణె ప్రేక్షకులకు వినోదం పంచనుంది. 

హోం టీం ఏం చేసేనో?

పుణె హోం టీమ్ పునేరి పల్టన్ ఈ లెగ్‌లో 7 మ్యాచ్‌లు ఆడనుంది. మరి ఈ ఏడింటిలో హోం అడ్వాంటేజ్ వాడుకుని ఎన్ని మ్యాచ్‌లను కైవసం చేసుకుంటో చూడాలి. ప్రస్తుతం పుణె జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లాడిన పునేరి ఏడింట మాత్రమే విజయం సాధించింది. క్వాలిఫయింగ్‌కు అర్హత సాధించాలంటే హోం లెగ్‌లో జరిగే మ్యాచ్‌లు గెలవడం పునేరి పల్టన్‌కు చాలా ముఖ్యం.

ఇక 61 పాయింట్లతో హర్యానా స్టీలర్స్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. 48 పాయింట్లతో తెలుగు టైటాన్స్ నాలుగో స్థానంలో ఉంది. లీగ్ మ్యాచ్‌లు ముగిసే సరికి పాయింట్ల పట్టికలో తొలి ఆరు స్థానా ల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. పట్నా రైడర్ దే వాంక్ 194 పాయింట్లతో ఉండగా.. 49 టాకిల్ పాయింట్లతో తమిళ్ డిఫెండర్ నితేశ్ కుమార్ తొలి స్థానంలో ఉన్నాడు.