calender_icon.png 16 August, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణి ప్రాజెక్టు నుండి నీటి విడుదల

16-08-2025 11:34:13 AM

ఎల్లారెడ్డి: (విజయక్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టులు(Kalyani project) నీటిమట్టం అధికంగా కావడంతో నీటిని విడుదల చేసిన నీటిపారుదల శాఖ అధికారులు. ఉమ్మడి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా వానలు పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు, వాగులు, చెరువుల్లోకి వరద నీరు వస్తోంది. కాగా.. ఎల్లారెడ్డి మండలంలో కురుస్తున్న వర్షాలకు కళ్యాణి ప్రాజెక్టులోకి శనివారం 600 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని నీటిపారుదల శాఖ ఈఈ సొలోమన్ తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 408.50 మీటర్ల నీరు నిల్వ ఉందన్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని ప్రాజెక్టు నిండడంతో నీటిని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసి 350 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న మంజీరలోకి వదులుతున్నారు. 250 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వరదనీటితో ప్రవహిస్తునందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.