01-12-2025 11:01:19 PM
మనోహరాబాద్ (విజయక్రాంతి): ఎన్నికల ఆచరణ నియమావళి అమలు నేపథ్యంలో తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగాకృష్ణ, మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ ఐడి పార్టీ సోమవారం నిర్వహించిన వాహన తనిఖీల సమయంలో మనోహరాబాద్ పీఎస్ పరిధిలోని కల్లకల్ లో అనుమానాస్పదంగా బైక్ మీద ప్రయాణిస్తున్న కుచారం గ్రామ నివాసి మనోజ్ కుమార్ ను అడ్డుకుని తనిఖీ చేయగా అతని వద్ద చట్టబద్ధ ఆధారాలు లేని 5 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది.
అదే స్థలంలోనే పంచనామా ప్రక్రియను విధి విధానాల ప్రకారం పూర్తి చేసి స్వాధీనం చేసిన నగదును సీజ్ మెమోతో పాటు సంబంధిత రికార్డుల్లో నమోదు చేసింది. అనంతరం స్వాధీనం చేసిన మొత్తాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం తూప్రాన్ ఆర్డీవోకు అధికారికంగా అప్పగించబడింది. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా అక్రమ రవాణా, అనధికార నగదు ప్రవాహం, ఇతర ఉల్లంఘనలను నిరోధించేందుకు ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని అధికారులు అన్నారు.