01-12-2025 10:52:00 PM
తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థి కుమ్మరి బాలకృష్ణ రెండో విడతలో భాగంగా వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలను మండల సమీకృత కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయడం జరిగింది. గ్రామ ప్రజల ఆశీస్సులతో బరిలోకి దిగడం జరిగింది. ప్రప్రథమంగా సర్పంచ్ గా బరిలో దిగుతుండడంతో గ్రామ ప్రజలు ఆశీర్వదించి అవకాశం కల్పించారని గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.