calender_icon.png 2 December, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఐవి నియంత్రణలో భాగస్వాములు కావాలి

01-12-2025 11:43:25 PM

రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డా.వాసం వెంకటేశ్వర్ రెడ్డి

ముషీరాబాద్ (విజయక్రాంతి): హెచ్‌ఐవి నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని సోమవారం లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు నిర్వహించ తలపెట్టిన హెచ్‌ఐవి ఎయిడ్స్ పై ర్యాలీని టీజీశాక్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ కళా భవన్‌లో నిర్వహించిన సమావేశంలో వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి. అనురాధ, అనురాగ్ యూనివర్సి టీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.